
అడ్డగోలు నియామకాలను రద్దు చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: అడ్డగోలుగా చేపట్టిన ఎంఈఓల నియామకాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం అనంతపురంలోని ఉపాధ్యాయ భవనంలో వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను ప్రభుత్వ, పీఆర్ హెచ్‌ఎంల ఉమ్మడి సీనియారిటీ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలా కాకుండా కేవలం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని మండిపడ్డారు. ఇది పంచాయతీ రాజ్ ప్రధానోపాధ్యాయులకు జరిగిన తీరని అన్యాయంగా భావిస్తున్నామన్నారు. అడ్డగోలుగా నియామకాలను వెంటనే రద్దుచేసి మళ్లీ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే శనివారం ఫ్యాప్టో తలపెట్టిన కార్యక్రమానికి వైఎస్సార్‌టీఏ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, రాష్ట్ర, జిల్లా నాయకులు గోవిందరెడ్డి, రవీంద్రారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, గంగాధర్ రెడ్డి వెంకటరమణ, గోపాల్, ఎన్. వెంకటరెడ్డి, కృష్ణా నాయక్, సిద్ధ ప్రసాద్, రామకృష్ణ, విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి