కిలో బంగారు ఆభరణాల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

కిలో బంగారు ఆభరణాల సీజ్‌

Aug 2 2025 6:28 AM | Updated on Aug 2 2025 6:28 AM

కిలో బంగారు ఆభరణాల సీజ్‌

కిలో బంగారు ఆభరణాల సీజ్‌

తాడిపత్రి టౌన్‌: మండలంలోని కడప రోడ్డులో గురువారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టిన సమయంలో కిలో బరువున్న బంగారు నగలతో పాటు రూ.1.48 లక్షల నగదు పట్టుబడింది. సరైన అనుమతి పత్రాలు లేకుండా తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరుకు కారులో నగలు, నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరుకు చెందిన నగల వ్యాపారి ఉభయ్‌దుల్లాతో పాటు ఆయన ఇద్దరు కుమారులు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, దాదాపు 1,123.92 గ్రాముల బంగారు ఆభర ణాలు, రూ.1,48,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు, నగదును కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.

రైల్వే క్వార్టర్స్‌లో చోరీ

రాయదుర్గం టౌన్‌: స్థానిక నూతన రైల్వే క్వార్టర్స్‌లో చోరీ జరిగింది. రైల్వే టీఆర్‌డీ (ట్రాక్షన్‌ అండ్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌) వర్కర్‌గా పనిచేస్తున్న నాగేంద్ర ఇంత కాలం తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి క్వార్టర్స్‌లో కేటాయించిన నూతన ఇంటికి గురువారం మొత్తం సామగ్రిని తరలించారు. అనంతరం శుక్రవారం నూతన గృహంలో చేరాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అద్దె ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలసి నిద్రించారు. ఇదే అదనుగా భావించిన దుండగులు క్వార్టర్స్‌లోని ఇంటి తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బ్యాగుల్లోని బంగారు, వెండి సామగ్రితో పాటు కొంత మేర నగదు అపహరించారు. శుక్రవారం ఉదయం నూతన గృహంలో పూజాదికాలు చేసేందుకు సిద్ధమై వచ్చిన నాగేంద్ర కుటుంబసభ్యులు చోరీ విషయాన్ని గుర్తించి ఆందోళనకు గురయ్యారు. మొత్తం రూ.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు అపహరించినట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement