అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు మండలాలకు ఎంఈఓలను నియమించారు. కుందుర్పి మండల విద్యాశాఖ అధికారిగా రాయదుర్గం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కే.శంకరన్న, డి.హీరేహాళ్ మండల విద్యాశాఖ అధికారిగా గుంతకల్లు ఎస్‌జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీడీ టి.వేణుగోపాలరావు, కంబదూరు మండల విద్యాశాఖ అధికారిగా అనంతపురం నంబర్– 2 ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచరు బి.ఉమాపతి, గుమ్మఘట్ట మండల విద్యాశాఖ అధికారిగా కళ్యాణదుర్గం కేసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచరు పి.సోమశేఖర్ (ఎఫ్‌ఏసీ)ను నియమిస్తూ పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో డి.హీరేహాళ్ ఎంఈఓ వేణుగోపాలరావు శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్నారు. తక్కిన ముగ్గురూ గురువారం బాధ్యతలు చేపట్టారు.
డీసీహెచ్‌ఎస్‌గా డేవిడ్ సాల్విన్ రాజ్
అనంతపురం మెడికల్: డీసీహెచ్‌ఎస్‌గా డాక్టర్ డేవిడ్ సాల్విన్ రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. తాడిపత్రి ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయన్ను ఇన్‌చార్జ్ డీసీహెచ్‌ఎస్‌గా నియమించారు. గతంలో ఈయన ప్రొద్దుటూరు, పులివెందుల ఏరియా ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్‌గా పని చేశారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ డేవిడ్‌కు సిబ్బంది అభినందనలు తెలిపారు.
గురుకులాల్లో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు అంబేడ్కర్ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి కె.జయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ లేదా సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.
బాలికలకు ఉరవకొండ కళాశాలలో ఎంఈసీ గ్రూపులో ఎస్సీ–18, ఎస్టీ–2, ఓసీ–1, సీఈసీలో ఎస్సీ–1, ఎస్టీ–1, ఓసీ–1, బ్రహ్మసముద్రం కళాశాలలో హెచ్‌ఈసీలో ఎస్సీ–9, ఎస్టీ–1, ఓసీ–1, సీఈసీలో ఎస్సీ–6, నల్లమాడ కళాశాలలో సీఈసీలో ఎస్సీ–39, ఎస్టీ–3, ఓసీ–1, బాలురకు సంబంధించి కణేకల్లు కళాశాలలో బైపీసీలో బీసీ–2, ఎస్సీ–1, కాళసముద్రం కళాశాలలో ఎంపీసీలో ఎస్టీ–1, బైపీసీ గ్రూపులో బీసీ–2, ఎస్సీ–2 సీట్లు ఖాళీలున్నాయని వెల్లడించారు.
ఆసక్తిగల విద్యార్థులు నేరుగా సర్టిఫికెట్లతో ఆయా కళాశాలలకు వెళ్లి అడ్మిషన్లు పొందవచ్చన్నారు. అలాగే పప్పూరులోని బాలుర ఐఐటీ, నీట్ కళాశాలలో బైపీసీ గ్రూపులో ఎస్సీ–2 సీట్లు ఖాళీలున్నాయన్నారు. పదో తరగతిలో రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాల్లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.

నాలుగు మండలాలకు ఎంఈఓల నియామకం