
జగన్ నాయకత్వానికి ఎన్‌ఆర్‌ఐల అండ: ఆలూరి
అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి ఎన్‌ఆర్‌ఐలు అండగా నిలుస్తున్నారని ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను పలువురు ఎన్‌ఆర్‌ఐలతో కలసి ఆలూరు సాంబశివారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో సుబ్బరామిరెడ్డి (డల్లాస్ – యూఎస్‌ఏ), మధు శ్రీధర్, చాళుక్య రెడ్డి, హుస్సేన్ (యునైటెడ్ కింగ్‌డమ్), గుణశేఖర్, అభిలాష్ (కెనడా), రమేష్ పనాటి (న్యూజిలాండ్), ప్రసన్నకుమార్ రెడ్డి (ఆస్ట్రేలియా), ఇలియాజ్ (గల్ఫ్ కన్వీనర్), సయ్యద్ అక్రం, గూడూరు కోటేశ్వరరెడ్డి, షేక్ అబ్దుల్లా, అరుణ్ చక్రవర్తి, చిన్న నాగముని గుండ్లూరు (దుబాయ్), షా హుస్సేన్ (కువైట్) ఉన్నారు.
ఆర్టీసీ ఆర్‌ఎంకు ఆత్మీయ వీడ్కోలు
అనంతపురం క్రైం: ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత్.ఆర్.ఆదోనికి ఎన్‌ఎంయూ నేతలు ఆత్మీయ వీడ్కోలు పలికారు. సర్వీసు పూర్తి కావడంతో గురువారం ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్‌ఎం కార్యాలయంలో సుమంత్.ఆర్.ఆదోనిని ఎన్‌ఎంయూ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంయూ జిల్లా అధ్యక్షుడు సూరిబాబు మాట్లాడుతూ.. ఐదున్నరేళ్లుగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూ జిల్లా కార్యదర్శి ప్రతాప్, శ్రీరామ్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ– స్టాంపు నిందితులకు బెయిల్
కళ్యాణదుర్గం రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కళ్యాణదుర్గం నకిలీ ఈ–స్టాంపుల కేసులో ముగ్గురు నిందితులకు బుధవారం బెయిల్ మంజూరైంది. ఏ1 కట్టా భార్గవి, ఏ2 ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు, ఏ3 మోహన్‌బాబులకు బెయిల్ ఇస్తూ కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి భాను ఉత్తర్వులిచ్చారు. దాదాపు నెల రోజుల తర్వాత వీరికి బెయిల్ రావడం గమనార్హం.

జగన్ నాయకత్వానికి ఎన్‌ఆర్‌ఐల అండ: ఆలూరి