
విద్యార్థులపై ‘కూటమి’ చిన్నచూపు
అనంతపురం రూరల్: పేద విద్యార్థులపై కూటమి ప్రభుత్వం చిన్న పూపు చూస్తోందని, ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాద్యక్షుడు మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మండిపడ్డారు. సోమవారం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆద్వర్యంలో నగరంలోని బీసీ, ఎస్సీ ప్రభుత్వ వసతి గృహాలను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నరేంద్రరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్యలు తాండవిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. సరిపడ గదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో బీసీ సంక్షేమశాఖ, వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు పెద్ద పీట వేశారన్నారు. ప్రభుత్వ బడుల్లో మాదిరే వసతి గృహాల్లో సైతం నాడు–నేడు పనులు చేపట్టి సమూల మార్పులు చేశారన్నారు. మెను ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితి ఆద్వానంగా మారిందన్నారు. వసతి గృహాల్లో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పెరగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలు అందించాలని, మెను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అద్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సుల్తాన్, నగర అధ్యక్షుడు కై లాష్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు నాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, ఎస్సీ సెల్ నగర మహిళా అధ్యక్షురాలు సాకే చంద్రకళ, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు తిప్పలూరి సుధీర్‌రెడ్డి, నిషాంత్‌రెడ్డి, నవీన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహాల్లో సమస్యలు తాండవిస్తున్నా పట్టించుకోని సర్కార్
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి

విద్యార్థులపై ‘కూటమి’ చిన్నచూపు