
● కొమ్మకొమ్మకూ గూడు
అందమైన ప్రకృతి రమణీయతలకు నెలవుగా నిలిచిన పెనకచెర్ల డ్యామ్ వద్ద పక్షి గూళ్లు ఆకట్టుకుంటున్నాయి. కిలకిల రావాలతో ఆహ్లాదాన్ని పంచే గిజిగాడు పక్షి తన పిల్లలను, గుడ్లను కాపాడుకునేందుకు ముళ్ల చెట్ల, నీటి వనరులకు దగ్గరలో ఉండే చెట్ల కొమ్మలకు కిందకు వేలాడేలా కట్టుకున్న గూళ్లు వాటి నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఒక్కొక్క గడ్డి పోచను తీసుకువచ్చి అల్లుకున్న గూడులో దాని అద్బుతమైన నైపుణ్యం కనిపిస్తుంది. మగ పక్షి మాత్రమే ఇలా గూడును అల్లే నైపుణ్యం, నేర్పు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అరుదైన బార్న్ స్వాలో పక్షులు మట్టితో మోరీల కింద నిర్మించిన గూళ్లు అబ్బురపరుస్తున్నాయి. ప్రకృతిలో ప్రతీది ఓ అద్భుతమేనంటూ చాటిచెబుతున్న బర్డ్ ఆర్కిటెక్ట్‌ను పరిశీలించాలంటే ఒకసారి పెనకచెర్ల డ్యామ్‌ను సందర్శించి తీరాల్సిందే. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:

● కొమ్మకొమ్మకూ గూడు