
అనగనగా ఓ బిహారి!
అనంతపురం మెడికల్: ఊరుకాని ఊరు... నా అనుకున్న వారు ఉన్నారో లేదో కూడా తెలీదు. కాలిన గాయాలు మానినా.. బిక్కుబిక్కుమంటూ జీజీహెచ్‌లోనే దోకాడుకుంటూ తిరుగుతోంది ఓ అభ్యాగురాలు. హిదీలో మాట్లాడితే.. తనకెవరూ లేరని సమాధానం ఇస్తోంది. కాస్త టీ ఇప్పించండి, ఆకలిగా ఉందంటూ అటు వెళ్తున్న వారిని పలకరిస్తూ దీనస్థితిలో వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని సర్జరీ విభాగంలో 30 ఏళ్ల వయసున్న బిహార్‌కు చెందిన జ్ఞాని ఉంటోంది. ఈ ఏడాది మార్చి 24న రైలులో ప్రయాణిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై 50 నుంచి 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి చేరింది. అందరూ బతకదనుకున్నారు. అయితే సర్జరీ వైద్యులు, స్టాఫ్‌నర్సులు వైద్యం అందించి ఆమెకు ఊపిరి పోశారు. కోలుకున్న తర్వాత తన వారి గురించి అడిగితే ‘పతా నహీ’ అంటూ సమాధానం ఇస్తోంది. దీంతో ఆమెను ఎక్కడికి పంపాలో తెలియని అయోమయంలో వైద్యులు పడ్డారు. మహిళలకు భద్రత లేని ప్రస్తుత రోజుల్లో ఆమెను బయటకు పంపిస్తే ఎలాంటి ఆపదలో పడుతుందోననే ఆందోళన వైద్యులు, నర్సుల్లో నెలకొంది. దీంతో మానవతా దృక్పథంతో ఆలోచించి సర్జరీ విభాగంలోనే ఆమెకు ఆశ్రయం కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సర్జరీ విభాగం వైద్యులు, నర్సులను అభినందిస్తున్నారు.
నాలుగు నెలలుగా
జీజీహెచ్ వార్డులోనే ఆశ్రయం
యువతి సంబంధీకుల ఆచూకీ
తెలియని వైనం
భద్రత దృష్ట్యా వార్డులోనే ఉంచిన
సర్జరీ విభాగం వైద్యులు

అనగనగా ఓ బిహారి!