
సైనికుల త్యాగం స్ఫూర్తిదాయకం
గుంతకల్లు: భారత సైనికుల త్యాగం, ధైర్యం నేటితరానికి స్ఫూర్తిదాయకమని వన్‌టౌన్ సీఐ మనోహర్, లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఖాజా గరీబ్ నవాజ్, మహేష్‌రాజు పేర్కొన్నారు. శనివారం కార్గిల్ దివస్ సందర్భంగా దాదాపు 500 మీటర్ల జాతీయ జెండాను గుంతకల్లు పురవీధుల్లో భారీ ర్యాలీతో ఊరేగించారు. ఈ సందర్భంగా రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు సమావేశంలో పలువురు వీరసైనికులను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ బలానికి, సహనానికి కార్గిల్ విజయగాథ నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కోశధికారి బాలాజీ, లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఇల్లూరు గోపాలకృష్ణ, మెంబర్లు రాము, రంగస్వామి, జగన్నాథ్, దినేష్, విజయ్‌బాస్కర్, రవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సైనికుల త్యాగం స్ఫూర్తిదాయకం