చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు

Jul 26 2025 8:44 AM | Updated on Jul 26 2025 9:44 AM

చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు

చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు

విడపనకల్లు: ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి మోసగాడని, అబద్ధాలకోరని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం విడపనకల్లులో గౌరమ్మబావి మైదానంలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యకమంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక పజలను వంచించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌లో ఒక్కటైన ‘తల్లికి వందనం’ పథకాన్ని అరకొరగా అమలు చేసి.. అన్ని పథకాలూ అమలు చేసేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. మహిళలను, విద్యార్థులను, రైతులను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి నిస్సిగ్గుగా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ‘సుపరి పాలనలో తొలి అడుగు’ అని కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటన్నారు. ఏడాది పాలనకే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన మహా ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అనతికాలంలోనే కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ‘నవరత్నాలు’ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు.

రెడ్‌బుక్‌ మాటున అక్రమ కేసులు..

వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్న కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చూపని ఉత్సాహం ‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో గిన్నిస్‌ బుక్‌ ఎక్కారని మండిపడ్డారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదికి రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామని ఇంతవరకూ ఇవ్వకుండా దగా చేశారన్నారు. కూటమి నేతల అరాచకాలను, పథకాల అమలు విషయంలో చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కురుబ రమేష్‌, ఎంపీపీ పుష్పావతి, నాయకులు భరత్‌రెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వీరన్న, మండల అధ్యక్షుడు కురుబ గిరిబాబు, ఉప కన్వీనర్‌ బోయ నాగేంద్ర, సీనియర్‌ నాయకులు కరణం భీంరెడ్డి, దేశాయ్‌ సిద్దార్థ, ఎస్సీసెల్‌ జిల్లా నాయకులు సుంకన్న, సర్పంచులు రామాంజనరెడ్డి, ఉమాశంకర్‌, కేశన్న, గాజుల చిన్న వెంకటేశులు, కుళ్లాయిస్వామి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement