
యంత్రం కింద పడి కూలీలకు గాయాలు
బొమ్మనహాళ్: వేరుశనగ నూర్పిడి యంత్రం కిందపడి పలువురు కూలీలు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన వండ్రప్ప, రామలింగ, గణేష్, శీన, రామాంజనేయులు, కిరణ్‌తో పాటు మరో నలుగురు కూలీలు శుక్రవారం ఉదయం రైతు చెన్నప్ప పొలంలో వేరుశనగ కాయలు ఆడించేందుకు ట్రాక్టర్ సాయంతో నూర్పిడి యంత్రాన్ని తీసుకుని బయలుదేరారు. వేరుశనగ యంత్రంపై ఇరువైపులా కూలీలు కూర్చొని ప్రయాణిస్తున్నారు. కొద్ది దూరం వెళ్లగానే ట్రాక్టర్‌కు అనుసంధానించిన రాడ్ కట్ కావడంతో నూర్పిడి యంత్రం కిందపడింది. దానిపై కూర్చొన్న కూలీలందరూ రోడ్డుపై పడి, తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో వండ్రమ్మ, రామలింగ, శీన, గణేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.