
జీజీహెచ్‌లో పోలీసుల ఓవరాక్షన్
అనంతపురం మెడికల్: రాత్రి సమయాల్లో సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లో వైద్యులు, సిబ్బందిపై తాగుబోతులు, పోకిరీలు దాడులు చేస్తున్నా.. ఏనాడూ అటుగా చూడని పోలీసులు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ రాకతో అత్యుత్సాహం కనబరిచి రోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. రామగిరి మండలంలో అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలికను పరామర్శించేందుకు బుధవారం రాయపాటి శైలజ జీజీహెచ్‌కు చేరుకున్నారు. అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆస్పత్రి మొత్తాన్ని అనంతపురం రెండో పట్టణ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లేబర్ వార్డు వైపుగా ఈగను సైతం వెళ్లకుండా పహారా కాశారు. అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ రోగుల సహాయకులను రక్తనిధి కేంద్రానికి సైతం వెళ్లకుండా అడ్డుకున్నారు. వార్డులనూ ఆధీనంలో ఉంచుకున్నారు. ఎక్స్‌రే, సిటీస్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌కు వెళ్లేవారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రిలో రోగులకంటే పోలీసులే అధికంగా ఉండడంతో వైద్య సిబ్బంది సైతం విధులను సక్రమంగా నిర్వర్తించలేక ఇబ్బంది పడ్డారు.

జీజీహెచ్‌లో పోలీసుల ఓవరాక్షన్