
3న ఉరవకొండలో యోగా పోటీలు
అనంతపురం కల్చరల్: జిల్లా యోగాసన అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 3న ఉరవకొండ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు వివేకానంద యోగ కేంద్రం అధ్యక్షుడు ఎం.రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు, కరపత్రాలను నగరంలోని షిరిడినగర్ యోగా కేంద్రంలో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. జిల్లా స్థాయి విజేతలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. ఖేలో ఇండియా, అస్మితా గేమ్స్, ఉమెన్‌లీగ్ తదితర పోటీలలో పాల్గొనే అవకాశం ఇస్తారన్నారు. ప్రతిభ చూపి జాతీయ స్థాయి వరకు వెళ్లే వారికి ఏషియన్ ఒలంపిక్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 99630 28694, 99634 98250 నంబర్లలో సంప్రదించాలని కోరారు.