
వీఆర్‌ఓల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
అనంతపురం అర్బన్: ఏపీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ గ్రేడ్–2 వీఆర్‌ఓల సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయానికి అందరూ కృషి చేయాలన్నారు.
నూతన కమిటీ.. : సంఘం జిల్లా అధ్యక్షుడిగా సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా విరూపాక్షరెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారిగా రాజు, ఉపాధ్యక్షులుగా నరేష్‌కుమార్, కుమారస్వామి, రాఘవేంద్రరాజు, సంయుక్త కార్యదర్శులుగా అనిల్, అశోక్‌కుమార్, రఘు యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా పురుషోత్తం, లిఖిత ఎన్నికయ్యారు. పర్యవేక్షక సభ్యులుగా సయ్యద్ అఫ్రిది, వెంకట రాజేష్, దిల్షాద్, వీరేష్, ఆదినారాయణ, నీలకంఠరెడ్డి ఎన్నికయ్యారు.

వీఆర్‌ఓల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక