
విఠల.. విఠల.. పాండురంగ విఠల
వైభవంగా రుక్మిణీ పాండురంగస్వామి రథోత్సవం
బొమ్మనహాళ్: ఆంధ్ర పండపరీపురంగా ప్రసిద్ధి చెందిన ఉంతకల్లులో రుక్మిణీ పాండురంగస్వామి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం అత్యంత వైభంగా జరిగింది. సాయంత్రం 5.30 గంటలకు పండరీపుర పీఠాధిపతి గోపాల్ మహరాజ్ ఆధ్వర్యంలో రుక్మిణీ పాండురంగస్వామి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తజన సందోహం నడుమ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయం నుంచి గ్రామ ప్రధాన వీధి, బసవన్న ఆలయం వరకు రథాన్ని లాగారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ‘విఠల... విఠల.. రుక్మీణీ పాండురంగ విఠల’ అంటూ భజనలు చేశారు. అనంతరం పల్లకీ మహోత్సవం నిర్వహించారు. ఎస్‌ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.