
పోక్సో కేసు నమోదు
పుట్లూరు: బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన 51 ఏళ్ల వయసున్న వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటనరసింహ తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. పుట్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటి వద్ద వాష్‌రూంకు వెళ్లి వస్తున్న తరుణంలో అదే గ్రామానికి చెందిన వెంకట్రాముడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తప్పించుకుని తల్లిదండ్రులకు తెలిపింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంకట్రాముడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎంఎల్‌హెచ్‌పీల
డిమాండ్లను నెరవేర్చాలి
అనంతపురం మెడికల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపించారు. సర్వజనాస్పత్రి ఎదుట నిరవధిక సమ్మె చేపట్టిన ఎంఎల్‌హెచ్‌పీలకు సోమవారం ఆయన సంఘీభావం తెలిపి, మాట్లాడారు. ఎంఎల్‌హెచ్‌పీలకు ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరేళ్లు దాటిన వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా వేతనాన్ని అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీ మిడ్‌లెవెల్ ప్రొవైడర్ అసోసియేషన్ నాయకులు గౌరి, అనూష, దివ్య, రాజేశ్వరి, వినోద్, శివరాం పాల్గొన్నారు.