
బ్రహ్మోత్సవాల పోస్టర్ల విడుదల
ఉరవకొండ: ఈ నెల 9 నుంచి ప్రారంభం కాను న్న పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన పోస్టర్లను కౌకుంట్లలోని తన స్వగృహంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం విడుదల చేశారు. ఆలయ ఈఓ సాకే రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు, బాలాజీ స్వామి తదితరులు పాల్గొన్నారు.
8న జిల్లా జైలులో వేలం
బుక్కరాయసముద్రం: మండలంలోని జిల్లా జైలులో ఈ నెల 8న 25 వేల కిలోల వేరుశనగ చెక్కకు వేలం పాట నిర్వహించనున్నారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ రహమాన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం ప్రక్రియలో పాల్గొనే వారు రూ.20 వేల ధరావత్తు చెల్లించాలి. వేలం ముగిసిన తర్వాత ధరావత్తు వెనక్కు చెల్లిస్తారు.