‘కామన్ సీనియారిటీ వర్తింపజేయాలి’
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని డీఎస్సీ 2008 హామీ పత్ర ఉపాధ్యాయులకు కామన్ సీనియార్టీ అమలు చేయాలని ఏపీటీఎఫ్(1938) నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబును మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘టిస్’లో బాధిత ఉపాధ్యాయులకు ఎడిట్ ఆప్షన్ కల్పించాలన్నారు. 2023 వేసవి సెలవుల్లో ఇండక్షన్ ట్రైనింగ్‌లో మొదటి మూడు విడతలకు హాజరైన డీఎస్సీ 1998, 2008 ఉపాధ్యాయులకు మాత్రమే ఐదు రోజుల వేతనం మంజూరుకు ఉత్తర్వులు ఇచ్చారని, 4, 5 విడతలకు హాజరైన డీఎస్సీ 1998, 2008 ఉపాధ్యాయులకు కూడా ఐదు రోజుల వేతనం మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఈఓ స్పందిస్తూ త్వరగతిన ఉత్తర్వులు విడుదల చేస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస నాయక్, డీఎస్సీ 2008 హామీ పత్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


