రామయ్య చల్లని దీవెనలతో జిల్లా సుభిక్షం | - | Sakshi
Sakshi News home page

రామయ్య చల్లని దీవెనలతో జిల్లా సుభిక్షం

Apr 7 2025 10:04 AM | Updated on Apr 7 2025 10:04 AM

రామయ్

రామయ్య చల్లని దీవెనలతో జిల్లా సుభిక్షం

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

అనంతపురం అర్బన్‌: రామయ్య చల్లని దీవెనలతో జిల్లా సుభిక్షంగా ఉండాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆకాంక్షించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక కృష్ణకళామందిర్‌లోని శ్రీ సీతారాముల దేవాలయంలో రెవెన్యూ సొసైటీ, రెవెన్యూ అసోసియేషన్‌, రెవెన్యూ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ దంపతులు పాల్గొని సీతారాముల కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీతారాముల కృపాకటాక్షాలతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, తహసీల్దారు హరికుమార్‌, సంఘాల నాయకులు దివాకర్‌రావు, కుళ్లాయప్ప, సంజీవరెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, భరత్‌, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో..

అనంతపురం: జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ జగదీష్‌ ముఖ్య అతిథిగా హాజరై స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు. సీతారాముల వారి కల్యాణం అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేశులు, సీఐలు ధరణి కిశోర్‌, హేమంత్‌ కుమార్‌, శేఖర్‌, జయపాల్‌ రెడ్డి, ఆర్‌ఐలు మధు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ రవిరాం నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

రామయ్య చల్లని దీవెనలతో జిల్లా సుభిక్షం1
1/1

రామయ్య చల్లని దీవెనలతో జిల్లా సుభిక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement