
●బార్ కాదిది.. బస్టాండే!
అధికారుల ఉదాసీనత కారణంగా బుక్కరాయసముద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులకు అందుబాటులో లేకుండా పోయింది. బస్టాండ్ ముందు భాగాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న కొందరు వివిధ రకాల వ్యాపారాలను ఏర్పాటు చేశారు. వీటి మాటున రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. బస్టాండ్‌లోనే మందు బాబులు తిష్టవేసి మద్యం సేవించిన అనంతరం ఖాళీ బాటిళ్లను అక్కడే వదిలేసి వెళుతున్నారు. మరికొందరు వాహనదారులు తమ ద్విచక్ర వాహనాలను బస్టాండ్‌లోపల ఉంచి వెళుతున్నారు. ఇవన్నీ ఓ ఎత్తయితే... మరోవైపు ప్రచార ఆర్భాటంతో స్థానిక టీడీపీ నేత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో కుండలు లేక బోసిపోయింది. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు మేల్కోంటారో లేదో చూడాలి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం

●బార్ కాదిది.. బస్టాండే!

●బార్ కాదిది.. బస్టాండే!