
మాటలొద్దు.. చేతలు కావాలి బాబూ
అనంతపురం కార్పొరేషన్: మాటలు చెప్పకుండా ఎకరాకు రూ.లక్ష ప్రకారం రైతులకు ఇచ్చి సీఎం చంద్రబాబు చేతల్లో చూపాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న నీర్జాంపల్లికి చెందిన రైతులు లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్పలను ఆయన పరామర్శించారు. అధైర్య పడరాదని బాధిత కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అడుగడుగునా రైతులకు చేయూతనందించారన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, రైతు భరోసాతో ఆదుకున్నారన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.