సాక్షి ప్రతినిధి, అనంతపురం: సున్నితమైన అంశాలే భార్యాభర్తల మధ్య అగాథాలు సృష్టిస్తున్నాయి. గోటితో పోయేవి గొడ్డలి వరకూ వస్తున్నాయి. క్షణికావేశంలో వీరు తీసుకుంటున్న నిర్ణయాలు బిడ్డలకు శాపంగా పరిణమిస్తున్నాయి. మనసు విప్పి పది నిముషాలు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్య అహంభావంతో ఇంకా జఠిలమవుతోంది.
మరొకరికి చెప్పుకుంటే..
సమస్యలను ఎవరికీ చెప్పుకోక పోవడం, డాక్టరు వద్దకు వెళ్లామంటే నామోషీగా భావిస్తుండటం వల్లే ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల మానసిక రుగ్మతలే ‘తీవ్ర’ నిర్ణయానికి దారితీస్తున్నట్టు పేర్కొంటున్నారు. సమస్య తలెత్తినప్పుడు భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయని సూచిస్తున్నారు.
కౌన్సెలింగ్‌తో పరిష్కారం
భార్యాభర్తల మధ్య అవగాహన లేకనే సమస్యలు తలెత్తుతున్నాయి. మా దగ్గరికి నెలకు 150 నుంచి 200 కేసులు వస్తున్నాయి. ప్రేమించే సమయంలో ఎక్కువ ప్రేమ చూపించారని ఇప్పుడు చూపించడం లేదని ఒకరు, తమను బయటకు తీసుకెళ్లడం లేదని, వివాహేతర సంబంధాలని ఇలా రకరకాల కేసులు ఉంటున్నాయి. మేం కేసులు కట్టేది 10 శాతం మాత్రమే. 90 శాతం కేసుల్ని కౌన్సెలింగ్ ద్వారానే పరిష్కరిస్తున్నాం. – మహబూబ్ బాషా, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ
ఇగోలు వీడాలి..
భార్యాభర్తల మధ్య కేవలం ఇగోల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని ఒకరమైన మానసిక రుగ్మతగానే పరిగణించాలి. చావు దేనికీ పరిష్కారం కాదనే విషయం గ్రహించాలి. డాక్టరు వద్దకు రావడానికి నామోషీ అయితే.. బంధువులు, స్నేహితులు, సన్నిహితుల దగ్గరైనా సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుంది. – డా.ఎండ్లూరి ప్రభాకర్,
మానసిక వైద్య నిపుణులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో
మానసిక రుగ్మతల బాధితులు
చిన్న సమస్యలకే దూరం
పెంచుకుంటున్న దంపతులు
రోజు రోజుకూ పెరుగుతున్న
బలవన్మరణాలు
తనువు చాలించి పిల్లలను
ఏకాకుల్ని చేస్తున్న వైనం
కౌన్సెలింగ్‌తో 90 శాతం
జంటల్లో సానుకూల మార్పులు
ఆలోచించండి.. ఓ అమ్మానాన్న !
ఆలోచించండి.. ఓ అమ్మానాన్న !
ఆలోచించండి.. ఓ అమ్మానాన్న !