రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పడిపోయింది. భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగడంతో పాటు కూటమి పార్టీల నేతల భూ ఆక్రమణలు, బెదిరింపుల నేపథ్యంలో స్థిరాస్తుల క్రయ విక్రయాలు మందగించాయని తెలుస్తోంది. | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పడిపోయింది. భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగడంతో పాటు కూటమి పార్టీల నేతల భూ ఆక్రమణలు, బెదిరింపుల నేపథ్యంలో స్థిరాస్తుల క్రయ విక్రయాలు మందగించాయని తెలుస్తోంది.

Mar 22 2025 1:24 AM | Updated on Mar 22 2025 1:21 AM

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. బాగా అభివృద్ధి చెందిన రెండు మహా నగరాలకు మధ్యలో ఉండటం ఒకెత్తయితే.. జాతీయ రహదారి అనంతపురం మీదుగా వెళుతుంది కాబట్టి స్థిరాస్తి రంగం అంచలంచెలుగా ఎదుగుతూ ఉండేది. బెంగళూరుకు చేరుకోవాలంటే రెండు గంటల్లో వెళ్లే పరిస్థితి. హైదరాబాద్‌కు కూడా నాలుగైదు గంటల్లో వెళ్లే అవకాశం ఉంది. మంచి రోడ్డు సౌకర్యంతోపాటు బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు రెండు గంటల్లో వెళ్లే అవకాశం ఉండటం వల్ల అనంతపురం అభివృద్ధి బాగా ఉండేది. కానీ ఇది గత చరిత్ర. కూటమి సర్కారు వచ్చాక స్థిరాస్తి రంగం కుదేలైంది. నిత్యం దందాలు, భూ ఆక్రమణలు, గొడవలు లాంటి పరిస్థితుల ప్రభావం సామాన్యులు, మధ్యతరగతి వారిపై తీవ్రంగా పడింది.

ఒక్క వెంచర్‌ వచ్చి ఉంటే ఒట్టు

అనంతపురం – బెంగళూరు జాతీయ రహదారి వెంట రియల్‌ ఎస్టేట్‌ బాగా ఉండేది. కానీ సర్కారు నిర్ణయాలు, పరిస్థితుల కారణంగా గడిచిన 9 నెలల్లో ఒక్క కొత్త వెంచర్‌ కూడా రాలేదు. భూములు కొని ప్లాట్‌లు వేద్దామన్న ఇన్వెస్టర్లే లేరు. అంతెందుకూ గతంలో వెంచర్లు వేసి కట్టిన ఇళ్ల కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి. అనంతపురం నగర పరిధిలో ఏటా అపార్ట్‌మెంట్లలో వెయ్యి ఫ్లాట్ల వరకు అమ్మకాలు జరిగేవి. కానీ గడిచిన తొమ్మిది నెలల్లో 200 ఫ్లాట్లు కూడా అమ్ముడుపోలేదు. తాడిపత్రి ప్రాంతంలోనూ స్థిరాస్తి క్రయవిక్రయాలు మరింత దిగజారినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ల ఆదాయం పతనం

జిల్లాలో మొత్తం 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వీటిలో అనంతపురం అర్బన్‌, రూరల్‌ కార్యాలయాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగేవి. అలాంటిది ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం పదిరోజుల్లో ముగుస్తున్నా ఇప్పటివరకూ 69 శాతానికి కూడా మించలేదు. గుంతకల్లు, ఉరవకొండ, యాడికి, కణేకల్లు వంటి ప్రాంతాల్లోనూ రిజిస్ట్రేషన్ల ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీనికితోడు ఇటీవల భూముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ల చార్జీలు భారీగా పెరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే వెంచర్లు లేదా బిల్డింగ్‌ యజమానులను కూటమి నేతలు బెదిరిస్తుండటంతో ఎవరూ ముందుకు రావడం లేదు.

కూటమి పాలనలో స్థిరాస్తి రంగం కుదేలు

తొమ్మిది నెలల్లో ఒక్క వెంచర్‌ కూడా ఏర్పాటు కాలేదు

కొత్త అపార్ట్‌మెంట్లు లేవు.. పాతవి అమ్ముడుపోలేదు

భూముల విలువ పెంపు.. సర్కారు చార్జీల బాదుడు

జిల్లాలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం

రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గణనీ1
1/1

రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గణనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement