కర్మచారీ వ్యవస్థను నిర్మూలించాలి | - | Sakshi
Sakshi News home page

కర్మచారీ వ్యవస్థను నిర్మూలించాలి

Mar 7 2025 10:09 AM | Updated on Mar 7 2025 10:05 AM

అనంతపురం అర్బన్‌: ‘సఫాయి కర్మచారీ (మాన్యువల్‌ స్కావెంజర్‌) వ్యవస్థనను సమూలంగా నిర్మూలించాలి. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు రుణాలు మంజూరు చేయాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న అన్ని మునిసిపాలిటీల్లో మహిళా పారిశుధ్య కార్మికులకు మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలి’ అని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో జిల్లా విజిలెన్స్‌ కమిటీ (మాన్యువల్‌ స్కావెంజర్స్‌ చట్టం– 2013) సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాన్‌హోల్స్‌లో మనుషులతో పనిచేయించడం సరికాదని, ఇలా పనిచేయించిన అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. పారిశుధ్య కార్మికులకు దుస్తులు, సబ్బులు, రేడియం జాకెట్‌, గ్లౌజులు, యూనిఫాం, కొబ్బరినూనె, గమ్‌బూట్లు, పనిముట్లు ఇవ్వాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న కర్మచారీలకు రుణాలు, శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెలకోసారి హెల్త్‌ క్యాంపు నిర్వహించి పారిశుధ్య కార్మికులతో పాటు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రాధిక, నగర పాలక కమిషనర్‌ బాలస్వామి, డ్వామా పీడీ సలీమ్‌బాషా, హౌసింగ్‌ పీడీ శైలజ, ఎల్‌డీఎం నర్సింగరావు, డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, పీఆర్‌ఎస్‌ఈ జహీర్‌ అస్లాం, బీసీ కార్పొరేషన్‌ ఈడీ సుబ్రహ్మణ్యం, గిరిజన సంక్షేమాధికారి రామాంజినేయులు, సభ్యులు పెన్నోబుళేసు, వినోద్‌కుమార్‌, రియాజ్‌ బాషా, సద్మావతి, మునిసిపల్‌ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.

ప్రతిష్టాత్మకంగా మహిళా దినోత్సవ ఏర్పాట్లు

ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం తన చాంబర్‌ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం జేఎన్‌టీయూ ఆడిటోరియంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ఐసీడీఎస్‌, మెప్మా, డీఆర్‌డీఏ, పోలీసు, సమగ్రశిక్ష తదితర శాఖల పరిధిలోని మహిళలకు అందిస్తున్న లక్‌పతి దీదీ, లైవ్లీ హుడ్‌ యూనిట్లు, బ్యాంక్‌ లింకేజీ, ఉన్నతి, పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ కింద యూనిట్లు, రుణాలు మంజూరు, గ్రౌండింగ్‌ చేయాలన్నారు. మెప్మా, ప్రేరణ సఖీ, శక్తియాప్‌, అనంత ఆత్మరక్షణ, 112 కాల్‌ సెంటర్‌, తదితర అన్ని రకాల స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement