
కలెక్టరేట్ నుంచి 100 మీటర్ల దూరానికి మార్కింగ్‌ను పరిశీలిస్తున్న సీఐ రెడ్డప్ప
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం కానుంది. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థుల వెంట వచ్చే వారిని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో నిలిపివేస్తారు. అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఉత్తరంగా ఆకాశవాణి కేంద్రం వైపున, తూర్పున చెరువుకట్ట వైపు, దక్షిణ దిశగా పెన్నార్ భవన్ రోడ్డువైపు 100 మీటర్ల దూరంతో మార్కింగ్ వేశారు. సర్వేయర్ ప్రతాపరెడ్డి పర్యవేక్షణలో జరిగిన మార్కింగ్ ప్రక్రియను వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప పరిశీలించారు.
ఓటరు నమోదుకు
రెండు రోజులే గడువు
● 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి
అనంతపురం అర్బన్: ప్రజాస్వామ్యంలో ఓటరు దేవుడు... ఓటు వజ్రాయుధం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కలిగి ఉండాలి. ఓటరు నమోదు నిరంత్ర ప్రక్రియ అయినప్పటికీ... ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలును ఎన్నికల కమిషన్ ఈ నెల 14 వరకు కల్పించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీకి వయసు 18 ఏళ్లు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని వారు దరఖాస్తు చేసుకోచ్చు. అదే విధంగా ఓటరు జాబితాలో చిరునామా మార్పునకు అవకాశం ఉంది.
అనుబంధ జాబితా రూపొందిస్తారు
ఓటరు నమోదుకు ఈ నెల 14 వరకు అందిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోగా పరిష్కరించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తారు. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాకు అనుబంధ జాబితా రూపొందిస్తారు.
ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు
కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలనుకుంటే... మీ ప్రాంతంలోని బూత్ లెవల్ అధికారి వద్ద దరఖాస్తు (ఫారం–6) ద్వారా నమోదు చేసుకోవచ్చు. అలా కాకున్నా ఆన్‌లైన్ ద్వారానైనా దరఖాస్తు చేసుకోవచ్చు. www.coean dhra.nic.in వెబ్‌సైట్ ద్వారా లేదా www.nsvp.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వీలు కల్పించారు.
15న మహిళా ఉద్యోగ మేళా
అనంతపురం: మొబైల్, ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలు ఈ నెల 15న కళ్యాణదుర్గం ఎకాలజీ సెంటర్లో మహిళా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత నుంచి డిగ్రీ ఉత్తీర్ణత/ ఫెయిల్ అయిన అమ్మాయిలు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. 18 నుంచి 26 సంవత్సరాల్లోపు వయస్సు గల వారై 43 నుంచి 65 కేజీల బరువు, ఎత్తు 145 సెంటీ మీటర్లు పైబడి ఉండాలని తెలిపారు. ఉద్యోగ మేళాలో ఎంపికై న అభ్యర్థులు నర్సాపుర ఇండస్ట్రియల్ ఏరియా, కోలార్ నందలి ప్రొడక్షన్ ఆపరేటర్స్, టెక్నికల్ ఆపరేటర్స్ పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కళ్యాణదుర్గం ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో తమ రెజ్యూమ్‌తో హాజరుకావాల్సి ఉంటుంది.
న్యూస్‌రీల్