హిందూపురం: స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2023–24 విద్యాసంవత్సరానికి డి–ఫార్మసీ (డిప్లొమా ఇన్ ఫార్మసీ) కోర్సులో మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 13న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ హరీష్‌బాబు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండేళ్ల కాల వ్యవధి ఉన్న ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్ బైపాసీ, ఎంపీసీలో ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు పది, ఇంటర్ మార్క్ లిస్టులు, స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధ్రువీకరణ, టీసీ ఒరిజినల్, మూడు సెట్ల జిరాక్స్ ప్రతులు తీసుకుని బుధవారం ఉదయం 9.30 గంటలకు కళాశాలలో జరిగే స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చు. ఏడాదికి రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్న ఓసీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌తో హాజరు కావచ్చు. ప్రవేశాలు పొందిన ఓసీ విద్యార్థులు రూ.6,300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.5,700 ట్యూషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు 98662 73402, 97038 43680లో సంప్రదించవచ్చు.