
సర్వజనాపత్రికి వచ్చిన కేసులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. దీనిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది. దీనివెనుక ఎవరున్నా చర్యలు తప్పవు. – గౌతమి, కలెక్టర్
అసౌకర్యం కల్గిస్తే వదిలేదే లేదు
ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు అసౌకర్యం కల్గించి ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తే వదిలేది లేదు. ఇలాంటి వాటిపై నాకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. నా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు ఇస్తే మిగతావన్నీ నేను చూస్తా. రోగుల తరలింపు వెనుక ఎంత పెద్ద వారున్నా వదిలే ప్రసక్తే లేదు. 94407 96800కు ఫోన్ చేస్తే చాలు.
– అన్బురాజన్, ఎస్పీ
