
కక్కలపల్లి మండీలో గురువారం కిలో టమాట గరిష్టంగా రూ.14, కనిష్టం రూ.3, సరాసరిన రూ.6.50 ప్రకారం పలికినట్లు అధికారులు తెలిపారు.
టన్ను చీనీ రూ.31 వేలు
అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం టన్ను చీనీకాయలు గరిష్టంగా రూ.31 వేలు పలికాయి.
శుక్రవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2023
శ్రీరామనవమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయాలకు భక్తజనం పోటెత్తారు. సీతారాముల కల్యాణోత్సవాలు కమనీయంగా సాగాయి. రాములోరి పరిణయోత్సవాన్ని కనులారా తిలకించిన జనం పరవశించిపోయారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని పలు చోట్ల ఉట్లోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు జై శ్రీరాం నామాన్ని మార్మోగించారు. – సాక్షి నెట్‌వర్క్
జై శ్రీరాం..

అనంతపురం నగరంలోని సున్నపుగేరులో ఉట్లోత్సవం తిలకిస్తున్న జనం


