
అనంతపురం: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మే 13న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మోటార్ వాహన ప్రమాదభరిత కేసులు, సివిల్ కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు (విడాకుల కేసులు కాకుండా) పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగ్గ క్రిమినల్ కేసులు, వినియోగదారుల ఫోరం కేసులు, పంచాయతీ ట్యాక్స్ కేసులు, మునిసిపల్ ట్యాక్స్ కేసులు, ప్రీలిటిగేషన్ కేసులకు సంబంధించి అనంతపురం, పుట్టపర్తిలోని అన్ని కోర్టుల్లోనూ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి రాజీ చేయనున్నట్లు వెల్లడించారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.