అనంతపురం సప్తగిరి సర్కిల్: ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ వేదికగా ఎన్‌ఐఐటీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్హత, 20 నుంచి 25 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. ఎంపికై న వారికి 30 రోజుల శిక్షణ అనంతరం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ఐసీఐసీఐ బ్యాంక్ శాఖల్లో రిలేషన్‌షిప్ మేనేజర్లుగా ఉద్యోగాలను కల్పిస్తారు. వీరికి నెలకు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకూ జీతం అందజేస్తారు. ఆసక్తి ఉన్న వారు పూర్తి బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలి. మరింత సమాచారానికి 78426 48484లో సంప్రదించవచ్చు.