నర్సీపట్నం: పట్టణంలోని లాడ్జీలో కర్ణాటక వ్యక్తి తీవ్ర గాయాల పాల య్యాడు. అతడితోపాటు వచ్చిన వారు బి.ఎన్.సాగర్ పేరు మీద లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. రెండు రోజులుగా నలుగురు కలిసి ఉంటున్నారు. శనివారం రాత్రి రూమ్‌లో బీరు సీసాలు పడి ఉన్నాయి. వారిలో ఒకరిపై దాడి జరిగింది. దాడికి గురైన వ్యక్తి అపసార్మక స్థితిలో పడి ఉన్నాడు. లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడితో దిగిన బి.ఎన్.సాగర్, మరో ఇద్దరు రూమ్ నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని పోలీసులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.


