మాకవరపాలెం: అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని తహసీల్దార్ ముజీబ్ స్పష్టం చేశారు. సాక్షిలో సోమవారం తవ్వుకో.. అమ్ముకో శీర్షికన వచ్చిన కథనంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ జంగాపల్లి సర్పానదిని ఆనుకుని నిర్వహిస్తున్న తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం, ఇసుకను తరలించడం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అలాగే జీ.కోడూరు, జంగాలపల్లి గ్రామ రెవెన్యూ అధికారులను ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. ఇకపై ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేస్తే ఆ రెండు గ్రామాల వీఆర్వోలపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
2న వాటర్ స్పోర్ట్స్ పోటీలు
అనకాపల్లి : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు ఏప్రిల్ 2న ముత్యాలమ్మపాలెం బీచ్‌లో సబ్ జూనియర్–15 జూనియర్–18 బాలబాలికలకు నిర్వహించడం జరుగుతుందని సంస్థ జిల్లా అధికారి పూజారి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి సైకిలింగ్ పోటీలలో ఎంపికైన బాలబాలికలు ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ల్లడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్లు 933277778, 8125416870లను సంప్రదించాలన్నారు.


