అర్జీల్లో భూ సమస్యలే అధికం | - | Sakshi
Sakshi News home page

అర్జీల్లో భూ సమస్యలే అధికం

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

● పీజీఆర్‌ఎస్‌–167, రెవెన్యూ క్లినిక్‌కు 181 అర్జీలు

తుమ్మపాల :సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల కార్యక్రమంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఅర్‌ఎస్‌కు 167, రెవిన్యూ క్లినిక్‌లో 181 మొత్తం 348 అర్జీలు వచ్చినట్టు కలెక్టర్‌ తెలిపారు. ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రామ మాణి, మెప్మా పీడీ కె.సరోజిని, ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మైనింగ్‌ అధికారులపై ఫిర్యాదు

చింతలూరులో గ్రాంట్‌ ఆర్డర్‌ లేకుండా 3 వేల క్యూబిక్‌ మీటర్ల అక్రమ మైనింగ్‌పై విచారణ కోరుతూ నర్సీపట్నం మైనింగ్‌ అధికారులకు చేసిన ఫిర్యాదుపై ముందు తేదీలతో తప్పుడు నివేదికలు ఇచ్చి, ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లను ఉద్దేశపూర్వకంగా నిరాకరించడం, గ్రామస్తులను మోసం చేసి సంతకాలు సేకరించడంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని మాడుగుల మండలం చింతలూరుకు చెందిన మెలిపాక మణికంఠ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్‌ 379–1లో అక్రమాలపై చేసిన ఆరు ఫిర్యాదులను నీరు గార్చడానికి మైనింగ్‌ అధికారులు, క్వారీ నిర్వాహకులు కలిసి నేరపూరిత చర్యలకు పాల్పడారని వారిపై చర్యలు తీసుకోవాలని, మైనింగ్‌ అధికారుల ప్రమేయం లేకుండా స్వతంత్ర టాస్క్‌ఫోర్స్‌ కమిటీతో పునర్విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement