లీజు విధానం... ఆలయ భూముల ఆక్రమణలకు ఊతం | - | Sakshi
Sakshi News home page

లీజు విధానం... ఆలయ భూముల ఆక్రమణలకు ఊతం

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

జిల్లాలో హిందు దేవాలయాల భూముల ఆక్రమణలపై విచారణ చేపట్టి భూములను రక్షించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునఃనిర్మాణం చేయాలని బీజేపీ జనతా వారధి కోకన్వీనర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దొగ్గా ఈశ్వరప్రసాద్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ప్రైవేటు భూములు దేవాలయ భూముల జాబితాలో కలిసిపోయాయనే నెపంతో వందల ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారని, దీంతో పాటు 33 ఏళ్ల పాటు దేవాలయ భూముల లీజు విధానం సరైంది కాదని అధికారులు పునఃపరిశీలన చేయాలన్నారు. జీవో నెం.139ను పూర్తిగా రద్దు చేయాలని, ఆక్రమణను రెగ్యులరైజ్‌ చేయడం నిలిపివేయాలని, దేవాలయాల ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికే ఖర్చుచేసేలా చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దింతో పాటు ఏళ్ల తరబడి సంచార జాతులగా నివాసముంటున్న కుటుంబాలను గుర్తించి వారికి కులధ్రువీకరణ పత్రాలు అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని మరో వినతి పత్రం అందించారు.

–దొగ్గా ఈశ్వరప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement