సీఎం పర్యటనపై జెడ్పీ సీఈవో సమీక్ష | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనపై జెడ్పీ సీఈవో సమీక్ష

Mar 19 2026 7:48 AM | Updated on Mar 19 2026 7:48 AM

నక్కపల్లి : ఈనెల 23న ఆర్సిలర్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనపై జిల్లాపరిషత్‌ సీఈవో నారాయణ మూర్తి బుధవారం సమీక్ష నిర్వహించారు. చందనాడ వద్ద ఈనెల 23న మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు, పలువురు వీఐపీలు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా నేతలు పర్యటించే ప్రాంతాలు, బహిరంగ సభ వేదిక తదితర ప్రాంతాల్లో శానిటేషన్‌ కార్యక్రమంపై పలు సూచనలు చేశారు. అలాగే బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి జన సమీకరణ చేయనున్నారు. వేంపాడు, చందనాడ, కాగిత, అమలాపురం, తదితర గ్రామాల పరిధిలో శానిటేషన్‌ పనులు, జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ఆయన పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement