అనకాపల్లి: అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్.నాయుడును తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షు డు బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. బి.ఆర్.నాయుడు రాజీనామా చేయాలని తిరుపతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న మహిళలపై దాడి చేయించడం దారుణమన్నారు. ఈ సంఘటనను ఖండిస్తూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు మంగళవారం నల్లబ్యాడ్జీలను ధరించి స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాల యం నుంచి నెహ్రూచౌక్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ప్రసాద్‌తో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యా ల నాయుడు, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి,వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, వైఎస్సార్‌సీపీ యలమంచిలి, పాయ కరావుపేట నియోజకర్గాల సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, పూల మాలలు వేసి నివా ళులర్పించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అనైతి క కార్యకలాపాలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుని తక్షణమే ఆపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో మహిళలు నిరసన తెలియజేస్తే, చంద్రబాబు ప్రభుత్వం వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నారా లోకేష్ రెడ్‌బుక్ పాలన సాగుతోందని ఆరోపించారు. మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ బి.ఆర్.నాయుడు అసాంఘిక కార్యకలాపాలను నిరసిస్తూ ఆందోళన చేసిన మహిళలను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ మహిళాలపై జరిగిన దాడులపై హోంమంత్రి వంగలపూడి అనిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మహిళా దినోత్సవం చేసుకుని పదిరోజులు కూడా కాకుండానే మహిళలను అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామిని కోట్లాది మంది భక్తులు పూజిస్తారని అటువంటి దేవాలయానికి చైర్మన్‌గా ఉంటూ బి.ఆర్.నాయుడు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లె సూరిబాబు,రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్‌రాజా, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షు డు మందపాటి జానకీరామరాజు, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు పెతకంశెట్టి జోసెఫ్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, చోడ వరం, యలమంచిలి నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు గండి రవి, కోలా గురువులు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్‌రాజా, 80,81,84 వార్డు ఇన్‌చార్జ్‌లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, కశింకోట, అనకాపల్లి మండల అధ్యక్షులు మలసాల కిషోర్, పెదిశెట్టి గోవింద్, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్
అనకాపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన
భారీ ఎత్తున బైక్‌ర్యాలీ, మానవహారం


