జగనన్న జన్మదినం రోజున మెగా రక్తదాన శిబిరం
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న నర్సీపట్నంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా 15 ఏళ్లుగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు హాజరై రక్తదానం చేయాలని ఆయన కోరారు. మండలాల పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పార్టీ టౌన్ అధ్యక్షులు ఏకా శివ, ఎంపీపీలు సుర్ల రాజేశ్వరి, మణికుమారి, సర్వేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, రమణ, నాగేశ్వరరావు, ఫాణిశాంతరామ్, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత తదితరులు పాల్గొన్నారు.


