గర్భిణులకు సకాలంలోవైద్య సేవలు అందించాలి
జిల్లా పరిషత్ సీ్త్రశిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ అనురాధ
కె.కోటపాడు: కె.కోటపాడు సీహెచ్‌సీలో గర్భిణులతో పాటు రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీ్త్రశిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈర్లె అనురాధ తెలిపారు. ఆమె బుధవారం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోనే గర్భిణులకు ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. కె.కోటపాడు, దేవరాపల్లి, వేపాడ, చీడికాడ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కె.కోటపాడు సీహెచ్‌సీకి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి అందరి మన్ననలు సిబ్బందిని కోరారు.


