లిక్విడ్ గంజాయితో వ్యక్తి అరెస్ట్
నర్సీపట్నం: లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రేవతమ్మ ఆదేశాల మేరకు బుధవారం నెల్లిమెట్ట వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. చింతపల్లి వైపు నుంచి వస్తున్న ప్రైవేటు వాహనాన్ని తనిఖీ చేయగా లిక్విడ్ గంజాయి బయటపడింది. గంజాయిని కేరళకు తరలిస్తున్న సహాయల్(28)ను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ రాజారావు తెలిపారు. సహాయల్ గంజాయి సేవించడంతో పాటు అక్కడ తాగే వారికి అమ్ముతున్నట్టు విచారణలో తేలిందని తెలిపారు. అతని వద్ద నుంచి కేజీ లిక్విడ్ గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.


