జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌కు 6 నమూనాలు
యలమంచిలి రూరల్ : స్థానిక కొత్తపేట జెడ్పీ హైస్కూల్‌లో బుధవారం నిర్వహించిన మండలస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆరు నమూనాలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు ఎంఈవో సూర్యప్రకాష్ తెలిపారు. 11 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు 41 నమూనాలను ప్రదర్శించారు. వారిలో కొక్కిరాపల్లి సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థినులు పి.లిఖిత, ఎం.గౌతమి ప్రదర్శించిన ఆరోగ్యం, పరిశుభ్రత, యలమంచిలి తులసీనగర్ జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని జి.మేఘవర్షిణి ప్రదర్శించిన గణిత పార్కు, సోమలింగపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి బి.గణేష్ ప్రదర్శించిన అభివృద్ధి చెందిన సాంకేతికతలు థీమ్, యలమంచిలి పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డు పాఠశాల విద్యార్థులు బి.రాజ్‌కిరణ్, సీహెచ్.మహేంద్ర రూపొందించిన మురుగునీటి సక్రమ నిర్వహణ నమూనా,పెదపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎ.అపర్ణ హరితశక్తి నమూనా,ఇదే పాఠశాల విద్యార్థి ని పి.దీప్తి ప్రదర్శించిన నీటి సంరక్షణ,నిర్వహణ నమూనాలను న్యాయనిర్ణేతలు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను,వారికి గైడ్ టీచర్లుగా వ్యవహరించిన ఉపాధ్యాయులను ఎంఈవో సూర్యప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు వై.వి.రమణ అభినందించారు.అంతకుముందు ఉదయం సైన్స్ ఫెయిర్‌ను ఎంపీపీ రాజాన శేషు ప్రారంభించారు. పోటీలను సీఆర్పీలు కిషోర్‌కుమార్,రత్నం పర్యవేక్షించారు.


