సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా మార్గాల్లో వయా దువ్వాడ మీదుగా పలు స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్ తెలిపారు.
● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07288) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 9, 11వ తేదీల్లో రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07289) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 10, 12వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07290) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 10, 12, 16, 18వ తేదీల్లో రాత్రి 7గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07291) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 13, 17, 19వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07292) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 17వ తేదీన రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07293) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 18న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరి అదే రోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
● వికారాబాద్–శ్రీకాకుళం రోడ్(07294) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 13న సాయంత్రం 5.15 గంటలకు వికారాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07295) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 14న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.


