రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
అచ్యుతాపురం రూరల్/కశింకోట: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అచ్యుతాపురం, కశింకోట మండలాలకు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. అచ్యుతాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికై నట్టు ఫిజికల్ డైరెక్టర్ దాడి శ్యాంప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. బాలుర విభాగంలో బొట్టా సాయి, పొలంరాశెట్టి తన్వేంద్ర, చొప్ప కిరణ్, వాసుపల్లి కిరణ్, జి.ఎల్.ఎన్. స్వామి, బాలికల విభాగంలో కొత్తపల్లి సంధ్య పాల్గోనున్నారు. ఎంపికై న విద్యార్థులను హెచ్‌ఎం పద్మావతి, చైర్మెన్ శెట్టి తాతారావు, వ్యాయామ ఉపాధ్యాయిని డి.పవిత్ర, సూర్యకళ తదితరులు అభినందించారు.
● కశింకోట సెయింట్ జాన్స్ స్కూలుకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికయ్యారు. జూనియర్ బాలుర విభాగంలో కె. సామ్యూల్ దయానంద్, బాలికల విభాగంలో టి. జైశ్రీ ఎంపికయ్యారని కరస్పాండెంట్ బత్తుల అనూరాధ, ప్రిన్సిపాల్ రూపనంది తెలిపారు.
● మండలంలోని ఏఎస్ పేట హై స్కూల్ కి చెందిన అంబటి లాస్య రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలకు ఎంపికై ంది. ప్రధానోపాధ్యాయుడు లంక శ్రీనివాసరావు,వ్యాయామ ఉపాధ్యాయుడు జయ బాబు తదితరులు ఆమెను అభినందించారు.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక


