300 లీటర్లసారా పులుపు ధ్వంసం
నాతవరం : నిబంధనలు ఉల్లఘించి నాటుసారా తయారీ చేసినా విక్రయించినా కేసులు నమోదు చేస్తామని నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు అన్నారు. మండలంలో గుమ్మడిగొండ గ్రామ సమీపంలో గల తాండవ నది ఓడ్డున గుట్టుగా నాటు సారా తయారు చేస్తున్న బట్టీలపై మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల పులుపు ధ్వంసం చేశారు. సారా తయారు చేసేందుకు ఉపయోగించే సామాగ్రిని కొన్నింటిని ధ్వంసం చేసి మిగిలినవి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే సారా తయారు చేసే నిర్వాహకులు పరారయ్యారు. సారాను అరికట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసామని ఎస్‌ఐ తెలిపారు.


