‘సమాధులకు గుర్తులు పెట్టుకోండి’
కశింకోట: కశింకోటలోని జామియా మసీదుకు చెందిన శ్మశానవాటికను ఎత్తు చేయాలని సంకల్పించామని, సమాధులు కనిపించకుండా పో యే అవకాశం ఉన్నందున మృతుల కు టుంబ సభ్యులు, బంధువులు వచ్చి గుర్తులు పెట్టుకోవాలని మసీదు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో కోరారు. ఏ మాత్రం వర్షం పడినా పల్లంగా ఉన్న శ్మశానవాటిక ప్రాంతంలో నీరు చేరి బురదగా మారుతున్న కారణంగా మృతుల అంత్యక్రియలకు, పక్కన మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. శ్మశానవాటిక ప్రాంతాన్ని మట్టితో పూడ్చి ఎత్తు చేయాలని భావిస్తున్నామన్నారు. శ్మశానంలో శాశ్వత సిమెంట్ సమాధులు నిర్మించడం సంప్రదాయానికి విరుద్ధమన్నారు.


