జిల్లా వినియోగదారులసంఘం అధ్యక్షుడిగా రాంబాబు
అనకాపల్లి: జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా రొంగలి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి విక్రమ్ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాపేటి శివసత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా బి.త్రినాథరావు, సహాయ కార్యదర్శిగా పసుపులేటి భవనేశ్వరరావుతో పాటు మరో 11 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా మరుపిల్లి ఎల్లారావు వ్యవహరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రొంగలి రాంబాబు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు.


