‘మాదిగలకు అన్యాయం జరిగితే సహించం’
కశింకోట : జిల్లాలో ఎక్కడైనా మాదిగ కులస్తులకు అన్యాయం జరిగితే సహించేది లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని బయ్యవరంలో జిల్లా మాదిగల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యలక మల్లిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మట్లాడుతూ మాదిగలను విస్మరించిన ఏ పార్టీలు చరిత్రలో నిలవలేదన్నారు. మాదిగలు మూడు దశాబ్దాల పోరాట ఫలితంగా ఏబీసీ వర్గీకరణతో రిజర్వేషన్ సాధించుకోవడంతో ఫలితాలు దక్కాయన్నారు. ఎ మ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్‌చార్జి పోసపల్లి వెంకటరావు, ఉత్తర కోస్తా జిల్లాల ఇన్‌ఛార్జి తోత్తరమూడి శ్రీనివాస్, ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లిపూడి సత్యనారాయణ, ఇండిగపల్లి దేముడుబాబు, జిల్లా ఎంఎస్పీ అధ్యక్షుడు ఎలుసూరి ఘాటీలు, జిల్లా అధికార ప్రతినిధి కొల్లి చిన్న అప్పారావు, కోశాధికారి చెవ్వే టి అప్పారావు, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకినాడ కనకేశ్వరరావు, ఎమ్మెస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టమూరి మంగరాజు పాల్గొన్నారు.
21 కేజీల గంజాయి స్వాధీనం
గొలుగొండ: కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చెరకు కాటా వద్ద రెండు బైక్‌లపై నలుగురు వ్యక్తులు 21 గంజాయి తరలిస్తుండగా ఎస్‌ఐ రుషికేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించారు. రెండు బైక్‌లపై ఏజెన్నీ నుంచి అల్లూరి జిల్లాకు చెందిన వంతల సత్తిబాబు, పాంగి సత్తిబాబుతో పాటు తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు తసెల్వరి, సెల్వర్లు గంజాయి తరలిస్తున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి పట్టుబడిందని, నిందితులను అదుపులోకి తీసుకుని, గంజాయితో పాటు రెండు బైకులు, మూడు సెల్‌ఫోన్లు, రూ.4520 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మారేడుమిల్లి–చింతూరు ఘాట్‌రోడ్డులో మంచు వాన
సూర్యోదయం వేళ.. మారేడుమిల్లి–చింతూరు ఘాట్‌రోడ్డు ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దం పడుతోంది. అడుగడుగునా దట్టమైన వృక్షాలు, భూమిని తాకేటట్టుగా వేలాడుతున్న పచ్చని తీగలు. వనమూలికల సువాసనతో స్వచ్ఛమైన గాలి ఔషధంగా మారిపోయింది. వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. చెట్లపైనుంచి జారే మంచు బిందువుల ’చిటపట’ శబ్దాలు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి. వ్యూపాయింట్ వద్ద మంచు అందాలు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. భానుడి స్వర్ణమయ కిరణాలు ఆకులపై పడి మరింత ప్రకాశవంతంగా మారాయి. మన్యం ప్రాంతమంతా స్వచ్ఛమైన ఆకుపచ్చ, గోధుమ, పసిడి రంగుల మేళవింపుతో సరికొత్త అందాన్ని సంతరించుకుంది. – రంపచోడవరం
‘మాదిగలకు అన్యాయం జరిగితే సహించం’
‘మాదిగలకు అన్యాయం జరిగితే సహించం’
‘మాదిగలకు అన్యాయం జరిగితే సహించం’
‘మాదిగలకు అన్యాయం జరిగితే సహించం’


