అమరజవాన్లకు నివాళులు
అనకాపల్లి : ఇండో–పాక్ యుద్ధంలో 1971 లో అమరులు జవాన్లకి ప్రతి ఏడాది డిసెంబర్ 16న నివాళులు అర్పించడం జరుగుతుందని అనకాపల్లి సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అగ్గాల హనుమంతరావు అన్నారు. స్థానిక మొయిన్‌రోడ్డు అసోసియేషన్ కార్యాయంలో అమర జవాన్ల చిత్రపటానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1971 యుద్ధంలో పాకిస్తాన్‌న్‌పై భారత సాయుధ దళాలు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 16, 1971న, పాకిస్థాన్ దళాల అధిపతి జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేయించారని 93,000 కంటే ఎక్కువ పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం, బంగ్లాదేశ్ ముక్తి బాహిని సంయుక్త దళాలకు లొంగిపోయారని తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది అతిపెద్ద సైనిక లొంగుబాటుగా మిగిలిపోయిందన్నారు. ఈ యుద్ధం తరువాత 13 రోజుల వివాదం తూర్పు పాకిస్తాన్ విముక్తి, బంగ్లాదేశ్‌ను స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా సృష్టించడంలో ముగిసిందన్నారు. ఈ యుద్ధం 13 రోజులు కొనసాగిందని, దాదాపు 3,900 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యు లు గొన్న ఆదిరాజు, రావాడ సత్యనారాయణ, గుణ నాగభూషణం, వంటాకు పైడితల్లి, జాజుల గోవిందరావు, మద్దాల నూకరాజు, వేగి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


