బయోగ్యాస్‌తో సుస్థిర భవిష్యత్తు సాధ్యం
పాయకరావుపేట : స్పేసెస్ డిగ్రీ కళాశాలలో బయోగ్యాస్‌పై అవగాహన సదస్సులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ గంగాగ్నిరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు బయోగ్యాస్ తయారీ విధానాలను వివరించారు. వ్యర్థాల నుండి బయోగ్యాస్ తయారు చేయడం పునరుత్పాదక శక్తి విధానాలలో ఉత్తమమైన మార్గం అని అన్నారు. తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని కలిగించకుండా డెయిరీ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, ఫార్మా కంపెనీల వ్యర్థాఉ ముడి పదార్థాలుగా ఉపయోగించి బయెగ్యాస్‌తో పాటు సేంద్రియ ఎరువును, విద్యుత్తును, వాహనాలకు ఇంధనం పొందవచ్చునని దీని ద్వారా వ్యర్థాలను సంపదగా మలచ్చుకోవచ్చునని తెలిపారు. బయోగ్యాస్ యువతకు ఉపాధి కల్పించడానికి దోహదపడుతుందని దేశ అభివృద్ధికి, సుస్ధిర భవిష్యత్తుకు సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత నరసింహారావు, చైర్మన్ డాక్టర్ కంటిపూడి నరేంద్రబాబు, ప్రిన్సిపాల్ డా. ఎ.రామకృష్ణారెడ్డి, శాస్త్రవేత్త, డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నగేష్ కుమార్, విద్యార్ధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


