‘మా ఊరి వెంకన్న’ చిత్ర నిర్మాత, దర్శకులకు అవార్డు ప్రదా
చిత్ర నిర్మాత కోటేశ్వర శర్మను సత్కరిస్తున్న దృశ్యం
మునగపాక: విజయవాడలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా మునగపాకకు చెందిన నిర్మాత వెలవలపల్లి కోటేశ్వర శర్మ నిర్మించిన మా ఊరి వెంకన్న చిత్రానికి అవార్డు అందజేశారు. యజ్ఞ శ్రీ బ్యానర్‌పై డాక్టర్ కోరుకొండ గోపీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగు ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపిక చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 14వ తేదీన ఆహుతుల చేతుల మీదుగా నిర్మాత కోటేశ్వరశర్మ, దర్శకుడు గోపీకృష్ణలు అవార్డుతోపాటు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.


