యలమంచిలిని ‘అనకాపల్లి’లోనే కొనసాగించాలి
మునగపాక: అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే యలమంచిలి నియోజకవర్గం కొనసాగించేలా చూడాలని కోరుతూ ఎమ్మెల్సీ వరుదు కల్యాణికి సోమవారం పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ వినతి అందజేశారు. సుదూర ప్రాంతమైన నక్కపల్లి డివిజన్‌లో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కలపడం వలన ఇబ్బందులు తప్పవని ప్రసాద్ వివరించారు. పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, ఎంపీటీసీలు మొల్లేటి నారాయణరావు, మద్దాల వీరునాయుడు, ఇల్లా నాగేశ్వరరావు, బొడ్డేడ బుజ్జి, గణపర్తి సర్పంచ్ చదరం నాయుడు తదితరులు పాల్గొన్నారు.


