వచ్చే నెల 21న పల్స్ పోలియో
తుమ్మపాల: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జనవరి 21 ఆదివారం రోజున జిల్లావ్యాప్తంగా ‘పోలియో ఆదివారం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి బ్యానర్ ఆవిష్కరించారు. ఎలాంటి అపోహలకు లోను కాకుండా తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాల ని కోరారు. అనంతరం జాతీయ విద్యుత్ వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద కలెక్టర్ విజయ కృష్ణన్ విద్యుత్ శాఖ ఎస్‌ఈ గొప్పు ప్రసాద్‌తో కలిసి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. విద్యు త్ పొదుపు పౌరులు బాధ్యతగా తీసుకోవాలన్నారు.


